07-04-2025 07:44:15 PM
తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సాజిద్ అలీ మాట్లాడుతూ... ప్రజలు తమ సమస్యలపై ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రహీముద్దీన్, అధికారులు పాల్గొన్నారు.