calender_icon.png 10 January, 2025 | 10:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రా కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి

05-01-2025 01:01:47 AM

  1. కమిషనర్ ఏవీ రంగనాథ్ 
  2. అయ్యప్ప సొసైటీలో నిర్మాణాల పరిశీలన

హైదరాబాద్ సిటీబ్యూరో (శేరిలింగంపల్లి), జనవరి 4 (విజయక్రాంతి): ప్రభుత్వ స్థలాలు, చెరువుల ఆక్ర  ఫిర్యాదులను స్వీకరించేందుకు హై  కార్యాల  బుద్ధ భవన్‌లో ఈనెల 6వ తేదీ ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శని  ఒక ప్రకటనలో తెలిపారు.

ఆక్రమణల విషయమై ఫిర్యాదు చేసేందుకు ప్రజ  తరుచుగా కార్యాలయానికి వస్తున్నారని ఈ క్రమంలో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిం  ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించాలని నిర్ణయించినట్టు రంగనాథ్ తెలిపారు.

ఈమేరకు ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యా  2 గంటల వరకు తిరిగి 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు. ఫిర్యాదుల విషయంలో ప్రజలకు ఏమైనా సందేహాలుంటే 040-2956 5758, 2956 0596 నంబర్లలో సంప్రదించాలన్నారు.

ఆ బిల్డింగ్‌పై రంగనాథ్ సీరియస్..

అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాల విషయమై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో శనివారం ఉదయం సొసైటీలోని పలు నిర్మాణాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. సొసైటీలోని 100 ఫీట్స్ రోడ్డులో నిర్మించిన ఓ ఇల్లీగల్ భవనం కూల్చివేతకు గతంలోనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని అయినప్పటికీ ఆ భవన నిర్మాణం కొనసాగుతోందని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైడ్రా ఆదేశాలతో ఆ భవనాన్ని కూల్చివేసేందుకు డీఆర్‌ఎఫ్ బృందాలు బిల్డింగ్ దగ్గరకు చేరుకున్నాయి. ఆదివారం ఉదయం బిల్డింగ్‌ను కూల్చివేయనున్నట్లు సమాచారం.