కరీంనగర్, ఫిబ్రవరి2 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియ మావళి అమలులో ఉన్న నేపథ్యం లో ఈనెల 3 న నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమం రద్దు చేయడంతో పాటు , ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎ న్నికల పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరగ దని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనిం చి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్య క్రమానికి ఫిర్యాదులు సమర్పించే నిమిత్తం కరీంనగర్ జిల్లా కేంద్రానికి రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత యధావిధిగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వ హించడం జరుగుతుందని వెల్లడించారు.