calender_icon.png 18 March, 2025 | 5:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి

18-03-2025 01:49:53 AM

సూర్యాపేట, మార్చి 17 (విజయక్రాంతి): శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమ స్యల పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉంటూ  ఫిర్యాదులపై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ నరసింహఅన్నారు. 

సోమవారం  జిల్లా పోలీస్  కార్యా లయంలో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పిర్యాదు దారు లతో మాట్లాడి వారి  అర్జిలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ  పిర్యాదు దారులకు బరోసా కల్పించాలని, ప్రతి అంశాన్ని చట్ట పరిదిలో పరిష్కరించడంలో, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.