30-03-2025 12:28:41 AM
హెచ్‌ఆర్‌డీసీఎల్ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో ప్రజావసరాలకు అనుగుణంగా అనుసంధాన (లింక్) రోడ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హెచ్‌ఆర్ డీసీఎల్) ఆధ్వర్యంలో చేపడుతున్న అనుసంధాన రహదారుల ని ర్మాణం, విస్తరణపై ఐసీసీసీలో ముఖ్యమంత్రి శనివారం సమీక్ష నిర్వహించారు. 49 రోడ్ల నిర్మా ణం, విస్తరణపై సూచనలు చేశా రు. వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత పెంచడంతో పా టు ప్రజలు ఇబ్బందులు లేకుం డా రాకపోకలు సాగించేలా రహదారుల నిర్మాణం ఉండాలని సీఎం ఆదేశించారు.
ఈ క్రమం లో ప్రజా ప్రయోజనాలను దృ ష్టిలో ఉంచుకోవాలని సీఎం సూ చించారు. అనుసంధాన రహదారుల నిర్మా ణం, ప్రస్తుతమున్న రహదారుల విస్తరణ విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని సీఎం అధికారులకు తెలిపారు. ఆయా రహదారుల నిర్మాణం వల్ల ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు వారికి సమయం కలిసొచ్చేలా ఉండాలని, ఈ క్రమంలో అదనపు భూసేకరణకు కొంత అధిక వ్యయమైనా వెనుకాడొద్దని సీఎం స్పష్టం చేశారు. సమీక్షలో సీఎం సలహాదారు వేంనరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.