calender_icon.png 5 March, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరు...

04-03-2025 09:01:11 PM

నాంపల్లి చంద్రమౌళి ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు..

మునుగోడు/నాంపల్లి (విజయక్రాంతి): హైదరాబాద్ ఇందిరా పార్క్ ముందు జరిగే ధర్నాకి వెళ్తున్న తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నాయకులను అక్రమ అరెస్ట్ తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందిస్తూ సేవలందిస్తున్న అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు ఎంతో శ్రమకోర్చి సేవలందిస్తుంటే వారికి శ్రమకు తగ్గ వేతనం లెక ఇబ్బందులకు గురవుతున్నారు.

తక్షణమే అంగన్వాడీ టీచర్లను ఆయాలని పర్మినెంట్ చేయాలని కనీస వేతనం అమలు చేయాలని మంగళవారం తలపెట్టిన ఇందిరా పార్క్ ధర్నాకి వెళ్తున్న అంగన్వాడీ టీచర్లు ఆయాలని అక్రమంగా అరెస్టు చేయడం అమానుషం అని అన్నారు. లాటిలు తూటాలు ప్రజా ఉద్యమాన్ని ఆపలేవని ఎన్ని సమస్యలు నిర్బంధాలు వచ్చినా సిఐటియు కార్మికుల పక్షాన ఉండి కనీస వేతనం అమలైయేంతవరకు పనికి తగ్గ వేతనం అందే వరకు పోరాటం కొనసాగిస్తుందని అన్నారు. అక్రమ అరెస్టు అయిన వారు నాంపల్లి చంద్రమౌళి, ఎదుళ్ళ తెరిసా, కాసం వెంకటమ్మ ఉన్నారు.