calender_icon.png 18 April, 2025 | 12:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్ బిల్లుపై 19న బహిరంగ సభ

14-04-2025 02:00:39 AM

  1. ముస్లిం హక్కుల పరిరక్షణకు కృషి
  2. ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ఇటీవ ల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 19న హైదరాబాద్‌లోని దరుస్సలాంలో  ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధుల ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

వక్ఫ్ బిల్లు కు ఇప్పటికే లోక్‌సభ, రాజ్యసభతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వక్ఫ్ బిల్లు ఆమోదం పొందితే ముస్లింల హక్కు లు హరిస్తాయని, అందుకే బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తున్నదని పేర్కొన్నారు.

ముస్లిం హక్కుల పరిరక్షణకు ఎంఐఎం కట్టుబడి ఉందని, ఈ మేరకు తమ పార్టీ  పనిచేస్తుందని వెల్లడించారు. నిరసన కార్యక్రమాల్లో ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు, ఎంఐఎం నేత లు పాల్గొంటారని వెల్లడించారు.