calender_icon.png 29 March, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

25-03-2025 01:07:08 AM

ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ 

ఖమ్మం, మార్చి -24 (విజయక్రాంతి): -ప్రజా సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్బంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు.ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్వో ఏ. పద్మశ్రీ, డిఆర్డీవో సన్యాసయ్య, కలెక్టరేట్ ఏవో అరుణ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.