సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకుడు బండారు రవి కుమార్...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండ అని సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకుడు బండారు రవికుమార్ అన్నారు. శనివారం ఆ పార్టీ రాష్ట్ర మహాసభల వాల్పోస్టర్లను నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... తమలో అనేక ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోడు రైతులు, కార్మికుల హక్కులపై పోరాటం కొనసాగించడం జరుగుతుందన్నారు.
కొమురం భీం జిల్లాలో అనేక సమస్యల పరిష్కారానికి పోరాటం చేసి వాటిని సాధించిన ఘనత పార్టీకి ఉందన్నారు. పార్టీ మహాసభలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజన్న, కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్, కోట శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు ఆనంద్ కుమార్ రాజేందర్, టీకానంద్, మాల శ్రీ పాల్గొన్నారు.