calender_icon.png 31 October, 2024 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాహితమే ‘బోట్ క్లబ్ ’ లక్ష్యం

01-07-2024 01:23:53 AM

క్లబ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ చెన్నాడి సుధాకర్‌రావు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 30 (విజయక్రాంతి): ప్రజాహితం కోసం ‘ది హైదరాబాద్ బోట్ క్లబ్ ’ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు క్లబ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ చెన్నాడి సుధాకర్‌రావు తెలిపారు. ఆదివారం బోట్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్త కమిటీ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. విద్యా, వైద్య రంగాలపై ప్రజలను చైతన్యవంతులు చేయడంతో పాటు మురికివాడల్లో క్లబ్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

అభివృద్ధికి నోచుకోని కాలనీలను ఎంపిక చేసుకొని ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం భవిష్యత్‌లో పని చేస్తామని చెప్పారు. 2024 సంవత్సరానికి ఎన్నికైన కొత్త కమిటీని ఆయన ప్రకటించారు. 8వ సారి అధ్యక్ష, కార్యదర్శులుగా చెన్నాడి సుధాకర్‌రావు, టీ అమరేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఏ మురళిధర్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీగా బీ నరేందర్‌రావు, కోశాధికారిగా కే ధరణిధర్, బోట్ క్లబ్ మీటింగ్ కమిటీ మెంబర్స్‌గా హెచ్‌వీ సురేందర్‌నాథ్, సోమ విజయ్‌ప్రకాష్, తుమ్మల శేషగిరిరావు,  టీ శ్రీధర్‌రెడ్డి, వీ సుధీర్‌రెడ్డి, విజయ్‌గోపాల్‌రావు ఎన్నికైనట్లు చెప్పారు.