calender_icon.png 22 November, 2024 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్ల కోసమే బహిరంగ విచారణ

22-11-2024 01:14:18 AM

డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు

జనగామ, నవంబర్ 21 (విజయక్రాంతి): వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను ఖరారు చేసేందుకే  ప్రభుత్వం బహిరంగ విచారణ చేపడుతున్నదని డెడికేటెడ్ బీసీ కమిషన్ చైర్మన్ బూసా ని వెంకటేశ్వరరావు అన్నారు. హనుమకొం డ కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా బహిరంగ విచారణ లో ఆయన మాట్లాడారు.

అనంతరం పలు బీసీ కుల సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రాజకీయ నాయకులు కమిషన్‌కు విజ్ఞప్తులు, వినతులు అందజేశా రు. విజ్ఞప్తులను స్వీకరించిన అనంతరం ఆ యన మాట్లాడుతూ కమిషన్‌కు 105 అభ్యర్థనలు అందాయన్నారు.

సమావేశంలో క మిషన్ కార్యదర్శి సైదులు, హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ డీడీ రమేశ్, రాంరెడ్డి,  బీసీ సంక్షేమశాఖ అధికారులు పుష్పలత, నరసింహాస్వా మి, రవీందర్‌రెడ్డి, శైలజ, రవీందర్ పాల్గొన్నారు.