సమగ్ర నివేదిక సమర్పిస్తామని జస్టిస్ షమీమ్ అక్తర్ వెల్లడి
నిజామాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): షెడ్యూల్ కులాల్లో ఉపవర్గీకరణపై వివరణ్మాతక అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ గురువారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో బహిరంగ విచారణ నిర్వహించింది. వర్గీకరణపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై అన్నివర్గాల వారి అభిప్రాయాలను తెలుసుకొని, క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. వర్గీకరణ అంశంతో పాటు సామాజిక స్థితిగతులకు సంబంధించి షెడ్యూల్ కులాలకు చెందిన అన్ని వర్గాల వారు ఎలాంటి ఒత్తిడి లేకుండా కమిషన్‌కు తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చొన్నారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, అడిషనల్ కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు.