calender_icon.png 11 January, 2025 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

5 నుంచి జిల్లాల్లో బహిరంగ విచారణ

04-12-2024 02:52:22 AM

వెల్లడించిన డెడికేటెడ్ కమిషన్

హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయ క్రాంతి): తెలంగాణలో బీసీ స్థితిగతులు, స్థా నిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అంశా న్ని నిర్ణయించేందుకు ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ పలు ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ విచారణ పూర్తిచేసింది. మరో మూడు జిల్లా ల్లో బహిరంగ విచారణకు సంబంధించిన తేదీలను మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కు సంబంధించిన బహిరంగ విచారణను ఈనెల 5న నిజామాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్టు తెలిపింది.

ఆదిలాబాద్, నిర్మ ల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు సంబంధించిన బహిరంగ విచారణను 6న ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో, కరీంనగ ర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు సంబంధించిన విచారణను 7న కరీం నగర్ కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్టు పేర్కొంది. డెడికేటెడ్ కమిషన్‌కు వినతులు ఇవ్వాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.