calender_icon.png 14 December, 2024 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

17న ఎస్సీ వర్గీకరణపై బహిరంగ విచారణ

14-12-2024 12:43:17 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 13 (విజయక్రాంతి): ఎస్సీ కులాల వర్గీకరణపై డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ ఈనెల 17న బహిరంగ విచారణ చేపట్టనుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు హైదరాబాద్ కలెక్టరేట్‌లో విచారణ కొనసాగుతుందని శుక్రవారం కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. 

నాణ్యమైన భోజనం అందించాలి

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీల కార్యక్రమ ప్రారంభోత్సవంపై  జిల్లాలో ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్  నిర్వహించారు. శనివారం జరిగే కార్యక్రమాల్లో మంత్రులు,  ప్రముఖలు హాజరై విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారని తెలిపారు.