17-12-2024 12:00:00 AM
కలెక్టరేట్‌లో వినతులు స్వీకరించనున్న
జస్టిస్ షమీమ్ అక్తర్
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16 (విజయక్రాంతి): ఎస్సీ కులాల వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పా టు చేసిన ఏకసభ్య కమిషన్ మంగళవారం బహిరంగ విచారణ చేపడుతోం దని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ వినతులు స్వీకరిస్తారని సోమవా రం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ ఉపవర్గీకరణకై విచారణ, అధ్యయనం కోసం చేపడుతున్న బహిరంగ విచారణకు జిల్లాలోని ఎస్సీ కుల సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.