calender_icon.png 6 March, 2025 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పబ్లిక్ హెల్త్ వర్కర్ మాధవి ఆత్మహత్యాయత్నం

06-03-2025 01:00:18 AM

ఖమ్మం, మార్చి 5 (విజయక్రాంతి): ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో పబ్లిక్ హెల్త్ వర్కర్ గా పని చేస్తున్న  మాధవి బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.తనను కావాలనే అకారణంగా సస్పెండ్ చేసారని మనస్తాపం చెంది మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా అస్పత్రికి తరలించారు.

ఆర్ ఐ గా పని చేసిన వ్యక్తి లైంగికంగా  వేదించే వాడని, గతంలో అతనిపై ఫిర్యాదు కూడా చేయడం జరిగిందని మాధవి కుటుంబ సభ్యులు ఆ రోపిస్తున్నారు.ఆర్‌ఐ  వేదింపులు తట్టుకోలేక 2019 లో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మాదవిని కావాలనే సస్పెండ్ చేయించారని ఆరోపి స్తున్నారు. ఆర్‌ఐపై కేసు పెట్టిందని అక్కసుతో ఆసిస్టెంట్ కమీషనర్‌తో కలిసి మాదవిని సస్పెండ్ చేయించారని మాదవి కుటుంబ సభ్యులు ఆరోస్తున్నారు. న్యాయం చేయాలని కోరుతున్నారు.