calender_icon.png 23 January, 2025 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజారోగ్య సంరక్షణకు ప్రాధాన్యం

16-07-2024 03:14:55 AM

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం, జూలై 15(విజయక్రాంతి): ప్రజారోగ్య సంరక్షణకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని, గ్రామాలను విష జ్వరాలు పీడిస్తున్న నేపథ్యంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌తో కలిసి తిరుమలాయ పాలెం మండలం జల్లేపల్లిలో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి జ్వర పీడితులను పరామర్శించారు. గ్రామంలో వంద మంది జ్వర పీడితులు ఉన్నారని గుర్తించారు.

బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌వో మాలతిని మంత్రి ఆదేశించారు. గ్రామాల్లో ముమ్మరంగా పారిశుధ్య చర్యలు చేపట్టాలని కలెక్టర్‌కు సూచించారు. ప్రతిఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అలాగే సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో మెడిసిన్ కొరత లేదని, వైద్యులు అందుబాటులో ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. కొందరు చికున్ గున్యా లక్షణాలతో సతమతమవుతున్నారని, వారికి వ్యాధి నిర్ధారణ కాలేదన్నారు.