calender_icon.png 20 April, 2025 | 11:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగ నిర్మూలనకు ప్రజా ప్రభుత్వం కృషి

12-04-2025 01:23:50 AM

రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క.

హనుమకొండ, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధి లోని ఎం.కె నాయుడు కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ 60 కంపెనీల ద్వారా 11వేల ఉద్యోగులు కల్పిస్తున్నాం, ఎన్నికల ముందు చెప్పాం .

నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిపిస్తామని అందులో భాగంగానే ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పై ప్రత్యేక దృష్టి సాధించాన్నారు.   జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, బల్దియ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకాడే, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ అఫ్జల్ బియ్యబాని కుస్రో పాషా, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్లు, జి డబ్ల్యూ ఎం సి జిల్లా ఉన్నతాధికారులు, నిరుద్యోగ యువతీయువకులు, తదితరులు పాల్గొన్నారు.