14-04-2025 05:24:41 PM
కామారెడ్డి మాజీ జెడ్పిటిసి నిమ్మ మోహన్ రెడ్డి..
కామారెడ్డి (విజయక్రాంతి): అంబేద్కర్ స్ఫూర్తితోనే ప్రజాసంక్షేమమే లక్ష్మంగా పెట్టుకొని ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని కామారెడ్డి మాజీ జెడ్పిటిసి నిమ్మమోహన్ రెడ్డి అన్నారు. 134వ జయంతి సందర్భంగా కామారెడ్డి మండలం షాబ్దీపూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలకు బాబా సాహెబ్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శ ప్రాయమైనది గా నిలిచి పోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నిమ్మ విజయకుమార్ రెడ్డి, అంబేద్కర్ సంఘం ప్రతినిధులు భూమయ్య, దుబ్బాక శంకర్, నరసింహులు, రాజయ్య, రాజు, రవితేజ, ధరంపురి, పరుశురాం, చింతల ప్రకాష్, చిన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.