calender_icon.png 20 November, 2024 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతికి తావివ్వకుండా ప్రజా పాలన

29-06-2024 01:14:46 AM

  • ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి 

వనపర్తి, జూన్ 28(విజయక్రాంతి): అవినీ తికి తావివ్వకుండా ప్రజాపాలనను అందించ డమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారాన్ని జూలై తర్వాత అమలు చేస్తామని చెప్పారు. శుక్రవా రం వనపర్తి జిల్లా పెద్దమం దడి మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసి, మాట్లాడా రు. పారదర్శకంగా అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందజేస్తామన్నారు.  ఎంపీపీ రఘుప్రసాద్, జడ్పీటీసీ రఘుపతి రెడ్డి, వైస్ ఎంపీపీ భారతి పాల్గొన్నారు. 

ప్రభుత్వ ప్రోగ్రాంలో మాజీ ఎంపీ ఫొటో?!

పెద్దమందడిలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమం కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో మాజీ ఎంపీ రాములు ఫొటోతో కూడిన ఫ్లెక్సీ దర్శనమిచ్చింది. నాగర్‌కర్నూల్ ఎంపీగా ప్రస్తుతం మల్లు రవి కొనసాగుతున్నారు. కానీ ఫ్లెక్సీలో మాత్రం మాజీ బీజేపీ ఎంపీ రాములు ఫొటో ఉండడం వెనుక ఆంతర్యం అధికారులకే తెలియాలి. బీజేపీ, కాంగ్రెస్‌కు మధ్య ఉన్న సంబంధం తేటతెల్లమైందంటూ బీఆర్‌ఎస్ నాయకులు సామా జిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు.