ఉత్సాహంగా పాల్గొన్న గ్రామ ప్రజలు
పల్లెల్లో పండుగ వాతావరణం...
చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండలం ఉన్న చేగుంట, మక్కరాజ్ పేట్, చందాయి పేట్, పెద్ద శివనోర్, అన్నంత సాగర్, బోనాల, కొండాపూర్, చెట్ల తిమ్మాహి పల్లి, నడిమి తండా, పొలంపల్లి, గ్రామాలలో నేడు గ్రామసభ నిర్వహించారు. గ్రామ సభలో అర్హుల జాబితాలో పేర్లు లేని వారు మళ్ళీ దరఖాస్తులు స్వీకరణ చేస్తామని మండల స్పెషల్ ఆఫీసర్, అధికారులు ప్రకటించడంతో మళ్ళీ గ్రామ పంచాయతీ దగ్గర దాఖాస్తులు స్వీకరించారు. గ్రామ ప్రజలు నగరాలు పట్టణాల్లో, నివసించే వారు గ్రామాల బాట పట్టారు. వివిధ ప్రాంతాల్లో నివసించే ప్రజలు గ్రామాలకు రావడంతో గ్రామంలో ఒక్కసారిగా పండుగ వాతావరణం మొదలైంది. దీంతో గ్రామపంచాయతీ కార్యాలయాల్లో జనసముద్రంగా మారాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు వారికి అండగా నిలిచి శ్రద్ధతో దరఖాస్తులు పెట్టించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్క పథకాన్ని నేరవేర్చుతూ వస్తుందని ప్రజలు అంటున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా నూతన వివాహం జరిగిన వారికి నూతన రేషన్ కార్డులు లేకపోవడంతో దరఖాస్తులు ప్రజలు ఉత్సాహంగా అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా నూతన రేషన్ కార్డులు లేక అనేక ఇబ్బందులు పడ్డామని ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాలను కూడా కోల్పోయాం అని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్క పథకాన్ని నెరవేర్చడం సంతోషదాయకం అని లబ్ధిదారులు అన్నారు. అనంతరం చేగుంట, అనంత సాగర్, పెద్ద శివనూర్, గ్రామాలలో మా పేర్లు ఎందుకు రాలేదని, ఆయా గ్రామాల స్పెషల్ ఆఫీసర్లను పంచాయతీ సెక్రెటరీలను ప్రజలు నిలదీశారు, చేగుంటలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ... గత ప్రభుత్వం ఇవ్వ లేయదు కానీ మా ప్రభుత్వం ఇస్తే మీకు ఓర్వలేక పోవడం బాధకారం అని మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ తెలిపరు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్లు, మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పార్టీ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.