calender_icon.png 7 October, 2024 | 5:57 PM

బీఆర్ఎస్ కావాలనే ప్రభుత్వంపై విషప్రచారం

07-10-2024 03:39:34 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): గాంధీభవన్ లో మంత్రులతో ప్రజల ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రి నాగేశ్వరరావుకు ప్రజలు 95 ఆర్జీలు ఇచ్చారు. అందులో భూసమస్యలు, ఉద్యోగాలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లపై అధిక ఆర్జీలు ఉన్నట్లు మంత్రి తెలిపారు.

కొన్ని సమస్యలపై జిల్లా కలెక్టర్లతో మాట్లాడి పరిష్కరిస్తున్నట్ల నాగేశ్వరరావు వెల్లడించారు. గాంధీభవన్ కు వస్తే సమస్యలు తీరుతాయని ప్రజలు వస్తుంటే, కొందరు బీఆర్ఎస్ నాయుకులు మాత్రం పనికట్టుకొని కావాలనే ప్రభుత్వంపై విషప్రచారం చేస్తోందని తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ రుణమాఫీలో ప్రపంచాన్ని మోసం చేసిందని, ఇప్పటివరకు 22 లక్షల మందికి రైతు రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.