calender_icon.png 3 April, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధోబీఘాట్ బస్తీలోతాగునీటి పబ్లిక్ నల్లా ఏర్పాటు

28-03-2025 12:06:18 AM

గాంధీనగర్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్

ముషీరాబాద్, మార్చి 27: (విజయక్రాంతి): డివిజన్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు గురువారం గాంధీనగర్ డివిజన్ లోని దోబి ఘాట్ బస్తీలో గత పదిహేను ఏళ్ళ క్రితం తీసివేసిన మంచినీటి పబ్లిక్ నల్లా కనెక్షన్ ను బస్తి వాసులు విజ్ఞప్తి మేరకు వాటర్ వరక్స్ అధికారులతో చర్చించి తిరిగి నల్లా కనెక్షన్ ను పునరుద్ధరించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని బస్తి వాసులకు పబ్లిక్ నల్లా ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు. అనంతరం కార్పొరేటర్‌ను మస్తు వాసులు శాలువాతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, ఓబీసీ మోర్చ అసెంబ్లీ కన్వీనర్ ఎం.ఉమేష్, సాయి కుమా ర్, ఆనంద్ రావు, బస్తి వాసులు మల్లికార్జున్, రమేష్, నాగరాజు, పూజిత, శోభ, సురేష్, వరమ్మా, సంజీవ,లక్ష్మి పాల్గొన్నారు.