calender_icon.png 30 January, 2025 | 11:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్టిపిసి నూతన విద్యుత్ ప్లాంట్ నిర్మాణంకై ప్రజాభిప్రాయ సేకరణ...

27-01-2025 07:42:10 PM

బందోబస్తు, సమీక్షలో రామగుండం సీపీ శ్రీనివాస్... 

రామగుండం (విజయక్రాంతి): రామగుండంలోని ఎన్టిపిసిలో కొత్తగా చేపట్టబోతున్న 2400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం మంగళవారం నాడు ప్రజాభిప్రాయ సేకరణకు అంతా సిద్ధం చేశారు. ఇందుకోసం భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం కాజిపల్లి ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో పోలీస్ అధికారులకు, సిబ్బందితో సీపీ శ్రీనివాస్ సమీక్షించారు. భద్రతపరమైన సూచనలు ఇచ్చారు. మొత్తం 785 మంది పోలీసు అధికారులు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఏసీపీలు-05, సీఐలు-25, ఎస్ఐ లు-48, మహిళా ఎస్సై-13, ఏఎస్ఐ/హెడ్ కానిస్టేబుల్-58, కానిస్టేబుళ్లు-393, మహిళా కానిస్టేబుళ్లు-145, హోంగార్డ్స్-62, మహిళా హోంగార్డ్స్-35 మంది మొత్తం 785 మందితో పోలీసు అధికారులు సిబ్బందితో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని సిపి తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి చేతన, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, రామగుండం పోలీస్ కమిషనరేట్ ఎసిపిలు, సీఐ లు, ఎస్ఐ లు బందోబస్త్ హాజరైన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.