calender_icon.png 19 April, 2025 | 11:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసు వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచాలి

17-04-2025 06:23:10 PM

మానుకోట ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్...

మహబూబాబాద్ (విజయక్రాంతి): వృత్తి నిబద్ధతతో పనిచేస్తూ పోలీసు వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంపొందించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్(District SP Sudhir Ram Nath Kekan) అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసు అధికారులతో నేరాల అదుపుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేర నియంత్రణ, శిక్షణ శాతాన్ని పెంచడం, విచారణను వేగవంతం చేయడం, నేర విచారణలో ఆధునిక పద్ధతులను వినియోగించడం, ప్రజలకు సైబర్ నేరాలు, రవాణా చట్టాలు, నకిలీ విత్తనాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

నకిలీ విత్తనాల విక్రయాలను అడ్డుకోవాలని అవసరమైతే అటువంటి చర్యలకు పాల్పడే వారిపై పిడిఎఫ్ నమోదు చేయాలని ఆదేశించారు. నిరంతరం టాస్క్ఫోర్స్ ద్వారా నిఘా పెంచి తనిఖీ చేయాలని ఆదేశించారు. వచ్చిన ఫిర్యాదులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని, నేరాలు పాల్పడే వారికి శిక్షలు పడేలా కృషి చేయాలన్నారు. క్రమం తప్పకుండా వాహనాలను తనిఖీ చేస్తూ రోడ్డు ప్రమాద సంఘటనలను జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బెట్టింగు, ఇతర లోన్ యాప్స్ ప్రలోభాలకు యువత గురికాకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలను అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణ కిషోర్, గండ్రాతి మోహన్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.