29-04-2025 01:00:03 AM
కాటారం (భూపాలపల్లి), ఏప్రిల్ 28 (విజయక్రాంతి) : ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్ అన్నారు.
సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.
సమస్యల పరిష్కారం కోసం సమర్పించిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా, సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేసినట్లు తెలిపారు. ప్రజావాణిలో 34 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజావాణి ప్రధాన ఉద్దేశం ప్రజల ఫిర్యాదులను స్వీకరించి త్వరితగతిన పరిష్కారం చేయడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రవి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.