calender_icon.png 15 April, 2025 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

08-04-2025 12:57:45 AM

వనపర్తి టౌన్ ఏప్రిల్ 7: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనప కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు,అదనపు కలెక్టర్ స్థా నిక సంస్థలు యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యంతో కలిసి ప్రజ ల నుంచి అదనపు కలెక్టర్ అర్జీలు స్వీకరించారు.

ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి ప్రజావాణి,మంత్రి ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజావాణి ఫిర్యాదులు, జిల్లా ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈరోజు ప్రజావాణికి మొత్తం 30 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.

  తహసీల్దార్లు రేషన్ షాపులను తనిఖీ చేయాలి 

జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ పై పర్యవేక్షణ ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడా దొడ్డు బియ్యం,సన్న బియ్యం కలిపి పంపిణీ చేయవద్దని సూచించారు.అలాంటి పనులు ఎక్కడైనా చేసినట్లు తీరితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని సదరు రేషన్ షాపు డీలర్ లైసెన్స్ క్యాన్సల్ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

అదేవిధంగా మరికొద్ది రోజుల్లో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభం కాబోతోందని,దాన్ని కొనుగోలు కేం ద్రాలను కూడా తహసిల్దారులు సందర్శించి పర్యవేక్షణ ఉంచాలన్నారు.అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల ఎంక్వయిరీ ప్రక్రియ కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.