calender_icon.png 21 January, 2025 | 7:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

21-01-2025 01:11:24 AM

  • గణతంత్ర దినోత్సవ వేడుకల  ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి 

జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ 

గద్వాల, జనవరి 20 ( విజయక్రాంతి ) : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్ అధికారులకు సూచించారు. సోమవారం సమీకత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వ హించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుండి (45) ఫిర్యాదులు అందాయి.

జిల్లా లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యా దుదారులు అందజేసిన అర్జీలను జిల్లా కలె క్టర్ బి.యం.సంతోష్, అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ, నర్సింగ్‌రావులతో కలిసి స్వీక రించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్ర మం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తులను ఎప్పటికి అప్ప డు పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్ర మంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 గణతంత్ర దినోత్సవ వేడుకల  ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి

గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనం గా నిర్వహించేందుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్  అధికారులను ఆదేశించారు. సోమవారం ఐ.డి.ఓ.సి సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా చేపట్టా ల్సిన కార్యక్రమాలపై ఆయా శాఖల వారీగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

గణ తంత్ర దినోత్సవ వేడుకలను ఎలాంటి లో టుపాట్లకు తావులేకుండా వేడుకలు సజా వుగా జరిగేలా ఆయా శాఖలు సమన్వ యంతో పని చేయాలని సూచించారు. పోలీ స్ పరేడ్‌గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహించను న్నందున అందుకనుగుణంగా వేదిక, సీటిం గ్ ఏర్పాట్లను పక్కాగా చేసుకోవాలని అన్నా రు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రొటోకాల్‌ను అనుసరిస్తూ అతిథులకు ఆ హ్వానాలు పంపాలని సూచించారు.

జాతీయ భావన పెంపొందేలా విద్యార్థులచే సాంస్క తిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అన్నారు.  అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చికి త్స అందించేలా వైద్య బందాన్ని వేడుక స్థలం వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని శాఖల అధికారులు తమకు అప్పగిం చిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహి స్తూ, వేడుకలు విజయవంతం అయ్యేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ, నర్సింగ్ రావు, ఆర్డిఓ శ్రీనివాస రావు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.