12-04-2025 12:08:16 AM
నల్లగొండ, ఏప్రిల్ 11 (విజయక్రాంతి) : ప్రత్యేక ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో వయోవృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజావాణికి ఆమె హాజరై ఫిర్యాదులు స్వీకరించారు. సదరం సర్టిఫికెట్లు జారీ చేయాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, పింఛన్లు మంజూరు చేయాలని దివ్యాంగులు కలెక్టర్కు విన్నవించారు.
బిడ్డల నుంచి పోషణ భత్యం ఇప్పించాలని, తమను పోషించేలా చూడాలని, భూ సమస్యలు ష్కరించాలని పలువురు వయోవృద్ధులు ఫిర్యాదులు అందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వయోవృద్ధుల సంరక్షణ బాధ్యత పిల్లలపై ఉంటుందని, ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను ప్రేమానురాగాలతో చూసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జడ్పీ సీఈఓ ప్రేమకరణ్ రెడ్డి, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, జిల్లా సంక్షేమశాఖ అధికారి కృష్ణవేణి, నల్లగొండ, దేవరకొండ, చండూరు ఆర్డీఓలు వై. అశోక్ రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.