calender_icon.png 8 April, 2025 | 7:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

08-04-2025 01:13:36 AM

జిల్లా కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్

సూర్యాపేట, ఏప్రిల్7(విజయక్రాంతి):ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తెజస్ నందలాల్ పవార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశమందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ బి.రాంబాబుతో కలిసి కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు.

ప్రజావాణిలో మొత్తం 50 ఫిర్యాదులు సమర్పించారని, శాఖల వారిగా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చిన విన్నపాలను పరిష్కరించడంలో కొన్ని శాఖలు తగు చర్యలు తీసుకోవడం లేదని, మొత్తం జిల్లాలో ఇప్పటివరకు ప్రజావాణి ద్వారా 3462 దరఖాస్తులు రాగా వాటిలో 2780 దరఖాస్తులను పరిష్కరించడం జరిగిందని 682 దరఖాస్తులు వివిధ కారణాల వల్ల పెండింగ్లో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.

ముఖ్యంగా డిపిఓ 89, ఎంప్లాయిమెంట్ అధికారి 22 డిటిడిఓ 13 దరఖాస్తులు పోలీసు శాఖ వారి 52 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రజావాణిలో ఆరు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని అధికారులు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని తెలిపారు. అధికారులు ప్రజల నుండి వచ్చిన విన్నపాలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులు ఆదేశించారు.