25-02-2025 12:50:46 AM
అదనపు కలెక్టర్ శ్రీనివాస్
నల్లగొండ, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి) : ప్రజావాణి ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో సోమవారం కలెక్టరేట్లో ప్రజల నుంచి ఆయ న ఫిర్యాదులు స్వీకరించి అధికారులతో మాట్లాడారు. ఫిర్యాదుల పరిష్కారంపై గ్రామస్థాయి అధికారుల వరకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.
పరిష్కారానికి వీలున్న వాటిని వెంటనే చేయాలని, వీల్లేకుంటే ఫిర్యాదుదారుకు స్పష్టమైన కారణా లు తెలపాలని సూచించారు. ప్రజావాణిలో 67 మంది ఫిర్యాదులు అధికారులకు అం దించారు. వీటిలో వ్యక్తిగత సమస్యలు, రెవె న్యూ, భూసమస్యలపై ఫిర్యాదులున్నాయి. ఇన్చార్జి డీఆర్‌ఓ అశోక్ రెడ్డి, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.