calender_icon.png 21 February, 2025 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి ఫిర్యాదులను పరిశీలించాలి

18-02-2025 12:39:35 AM

కలెక్టర్ ఆశిష్ 

కామారెడ్డి, ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కి వచ్చిన ఫిర్యాదులు పరిశీలించారు.  ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులకు సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలని తెలిపారు.  ప్రజావాణి లో 58  ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో ఇటీవల పాల్గొనని కుటుంబాల వివరాలు నేటి నుండి 28 వరకు ఇటీవల సర్వే లో నమోదు చేసుకొనని కుటుంబాల వివరాలు ఎంట్రీ చేసుకునే విధంగా ప్రభుత్వం మరొక  అవకాశం కల్పించిందని తెలిపారు. సర్వే కు సంబంధించిన కుటుంబ వివరాలు నమోదు చేసుకునేందుకు మండల అభివృద్ధి అధికారి కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లోని ప్రజా పాలన సేవా కేంద్రాల్లో నిర్ణీత పొఫార్మాలో పూర్తి వివరాలు నమోదు చేసుకోవచ్చని,  లేదా ప్రభుత్వం ఇట్టి విషయంలో ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ నెంబర్ 040- 21111111 నకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సదరు కుటుంబ వివరాలు తెలియజేయవచ్ఛని, అట్టి వివరాల ఆధారంగా ఆ కుటుంబం వద్దకు సిబ్బందిని పంపించి సర్వే వివరాలను తీసుకోనున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయి నుండి వచ్చే సమాచారాన్ని సంబంధిత మండల అధికారులకు పంపించడం జరుగుతుందని, వాటిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.