నారాయణపేట, జనవరి 6 (విజయ క్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదు లను తక్షణమే పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుండి 35 పిర్యాదు దారులు తమ సమస్యలను విన్న విస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఈ అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ,సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్య క్రమంలో ఆర్ డి ఓ రామచందర్, ఏ ఓ జయసుధ. వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గోన్నారు