calender_icon.png 21 March, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు ప్యారానగర్, నల్లవల్లి డంపింగ్ యార్డ్ సమస్యపై ప్రజా బ్యాలెట్

20-03-2025 04:45:55 PM

జిన్నారం: గుమ్మడిదల మండల పరిధిలోని నల్లవల్లి పంచాయతీ పరిధిలోని ప్యారానగర్ లో ఏర్పాటు చేసే డంపింగ్ యార్డ్ ను వ్యతిరేకిస్తూ శుక్రవారం ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తామని జేఏసీ చైర్మన్ ‌సీహెచ్ జైపాల్ రెడ్డి, ప్రజా సంఘాల వేదిక నాయకులు గొల్లపల్లి జయరాజు తెలిపారు. గురువారం గుమ్మడిదల మండల కేంద్రంలో ప్రజా బ్యాలెట్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... శుక్రవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రజా బ్యాలెట్ నిర్వహించడం జరుగుతుందని, ఈ ఓటింగ్ కార్యక్రమంలో మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జేఏసీ, ప్రజాసంఘాల పోరాట వేదిక నిర్ణయం మెరుపు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, గ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల జేఏసీ నాయకులు పాల్గొన్నారు.