calender_icon.png 13 February, 2025 | 12:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన

13-02-2025 01:02:58 AM

వనపర్తి, ఫిబ్రవరి 12 ( విజయక్రాంతి ) :   వనపర్తి జిల్లా ప్రజలు ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలనే సంకల్పంతో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఒక సందేశం పైన తన స్వహస్తంతో  సంతకం చేసి లక్షల మంది విద్యార్థులకు పంపించారు.నిత్యం రోడ్డు ప్రమాదాల బారినపడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు జనవరి, 2025 ను రోడ్డు భద్రతా మాసోత్సవంగా  ప్రకటించాయి.

జిల్లా పోలీస్ శాఖ, రోడ్డు రవాణా శాఖలు రోడ్డు భద్రతపై నెల రోజుల పాటు రోజుకో కార్యక్రమం చొప్పున  ప్రజలకు రోడ్డు నియ మాలు, భద్రత పై అవగాహన కల్పించారు . జిల్లా ప్రజలు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా తాము సురక్షితంగా ఉంటూ ఇతరులను సురక్షితంగా ఉంచాలనే జిల్లా కలెక్టర్ చేసిన మంచి ప్రయత్నం సఫలీకృతమై వనపర్తి జిల్లాలోని విద్యార్థుల తల్లితండ్రులు వారి పిల్లలు చెప్పిన మాటలు విని తూచ తప్పకుండా పాటిస్తూ రోడ్డు ప్రమాదాలు లేని జిల్లాగా ఉండాలని ఆశిద్దాం.