25-03-2025 01:00:43 AM
నారాయణఖేడ్, మార్చి 24: రాజ్యాంగ పరిరక్షణ కోసం జనచైతన్య పాదయాత్ర ఉం టుందని, జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ పేరుతో సంవత్సరం కాలం పాటు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ జూలూరి ధనలక్ష్మి అన్నారు. సోమవారం నారాయణఖేడ్ పట్టణం కు వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఎస్సీ సెల్, ఎస్టీ సెల్ మండల గ్రామ స్థాయి నా యకులతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని యాత్ర కోసం గ్రామ, పట్టణ, నియో జకవర్గ ప్రతి పల్లె, ప్రతి గడపకు పాదయాత్ర ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమం మహాత్మా గాంధీ శతాబ్ద జయంతి లో భాగంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, సిర్గాపూర్ మాజీ సర్పంచ్ స్వప్న శంకరయ్య , తాహెర్ అలీ, ఎస్సీ సెల్ నాయకులు సిర్గాపూర్ కృష్ణ, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.