calender_icon.png 10 March, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన

09-03-2025 08:39:10 PM

పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో ఆదివారం స్థానిక పోలీసులు ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు ఖాతా నంబరు, ఆధార్ తదితర వివరాలు అడిగితే సమాచారం ఇవ్వొద్దన్నారు. ప్రజలు బైక్లు నడిపే సమయంలో కచ్చితంగా హెల్మెట్లను ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని ఒకవేళ మైనర్లు వాహనాలు నడుపుతూ దొరికితే తల్లిదండ్రులపై కేసు నమోదు చేయడంతో పాటు జరిమానా విధిస్తామని సూచించారు. మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని పేర్కొన్నారు. మండల పరిధిలోని వాహనదారులు సూచనలు పాటించాలని లేకుంటే కేసులు నమోదు చేస్తామని పెద్ద కొడప్గల్ పోలీస్ సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది సాయి శివ, అంజి, జైపాల్ రెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.