రామయంపేట (విజయక్రాంతి): రామాయoపేట పట్టణంలో ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీని స్థానిక మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాపాలనకు సంబంధించిన పలు సంక్షేమ పథకాలను ఆవిష్కరించడం జరిగింది. మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలకు సంబంధించి మంజూరైన పలు చెక్కులు మంజూరు, సంక్షేమ పథకాల, మహిళా శక్తి, స్ట్రీట్ వెండర్ తో పాటు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరిగింది. ప్రజలకు సంబంధించి ప్రజలకు చేరువయ్యే సంక్షేమ పథకాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, మేనేజర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు దేమే యాదగిరి, సుందర్ సింగ్, బొర్ర అనిల్ కుమార్, మల్యాల కవిత కిషన్, మెప్మా ఆర్పీలు మర్కు లావణ్య, ఆర్ లావణ్య, జి.స్రవంతి, స్వాతి, జయశ్రీ, వసంత, బాల లక్ష్మి, తరంగిణి, ఆర్ స్రవంతి, కే. శ్రీలత, పి. శ్రీలత, ఆశ వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.