calender_icon.png 13 January, 2025 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రజాపాలన రిహార్సల్స్

16-09-2024 12:13:05 AM

పరిశీలించిన డీజీపీ జితేందర్

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం (సెప్టెంబర్ 17న) పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించబోయే ప్రజాపాలన దినోత్సవం వేడుకల రిహార్సల్స్‌ను ఆదివారం రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం.. సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే జెండావిష్కరణ,  ప్రజాపాలన సందేశం రిహార్సల్స్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట, విద్యుత్ శాఖ కమిషనర్ ముషారఫ్ ఫారుఖీ, సమాచారశాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జేడీ సెక్రటరీ ప్రొటోకాల్ ఎస్ వెంకట్రావ్, పోలీస్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.