- సీఎం రేవంత్‌రెడ్డిపై అసత్యాలు ప్రచారం చేస్తున్న హరీశ్ రావు, కేటీఆర్, కౌశిక్ రెడ్డి
- సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్, జనవరి 16 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజాపాలన చూసి ఓర్వలేకనే బిఆర్‌ఎస్ పార్టీ దొంగల ముఠా విషప్రచారం చేస్తుందని సుడా చైర్మ న్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కోమ టిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2013 నుంచి కౌశిక్ రెడ్డి మీద కేసుల పరంపర కొనసాగుతుం దని ఆరోపించారు.
17 కేసులు కేసీఆర్ ప్ర భుత్వంలోనే నమోదు అయ్యయని విమర్శిం చారు. దొంగల ముఠా నాయకుడు హరీష్ రావు సిగ్గు లేకుండా సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. 2014 నుండి 2023 వరకు కౌశిక్ రెడ్డి మీద నమోదైన కేసులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏవిధంగా బాధ్యత వహిస్తుందని ప్రశ్నించారు. అసత్యా లను ప్రచారం చేస్తున్న బిఆర్‌ఎస్ దొంగల ముఠాను ప్రజలు అడుగడుగునా నిలదీ యాలని కోరారు.
మీడియాను, ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా బిఆర్‌ఎస్ పార్టీ గ్లోబల్ ప్రచారానికి దిగిందని ఆరోపిం చారు. 2013 నుంచి 2023 వరకు కౌశిక్ రెడ్డి మీద నమోదైన కేసులకు ఎవరు బాధ్య త వహిస్తారో, ఇప్పుడు బిఆర్‌ఎస్ పార్టీ ఏం సమాధానం చెబుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్‌రెడ్డి సచిలుడని, నిజాయితీ పరుడని అసలు పదేళ్లలో జరిగిన నేరాలకు, నమోదైన కేసులకు ఎలాంటి సంబంధం లేదని క్లీన్ చిట్ ఇస్తున్న దొంగల ముఠా నాయకుడు హరీష్‌రావు నిస్సిగ్గుగా మాట్లాడటం ఏమిటని దుయ్యబట్టారు.
గత ఏడాది కాలంలో ప్రజా పాలన దెబ్బకు బిఆర్‌ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోయిందని, 65 లక్షల సభ్యత్వం కాస్త 20 లక్షలకు దిగజా రిందని, బిఆర్‌ఎస్ దొంగల ముఠా ఇప్పటి కైనా కళ్ళు తెరచి గ్రహించాలన్నారు. బిఆర్ ఎస్ పార్టీ నుంచి 40 లక్షల మంది ఎవరి దారి వాళ్లు చూసుకున్నారని, ఇంకా బిఆర్‌ఎ స్ పార్టీ బలంగా ఉందని ఊహించడం హాస్యాస్పదమన్నారు.
మొన్న కరీంనగర్ కలె క్టరేట్లో జరిగిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబుపై కౌశిక్ రెడ్డి దాడికి యత్నించాడని, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను ముందుగా, కౌశిక్ రెడ్డి చేయి పెట్టి నెట్టేసిన వీడియోను ప్లే చేసి చూపించారు. మంత్రి శ్రీధర్ బాబు, మచ్చ లేనటువంటి, నిఖార్సయిన నేతను పట్టుకొని, మంత్రి శ్రీధర్ బాబు, నన్ను బెదిరించాడని ప్రెస్ మీట్‌లో కౌశిక్‌రెడ్డి ఆరోపించడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నా రు.
కాంగ్రెస్ ప్రభుత్వం పై బురద చల్లడానికి ప్రయత్నిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని, ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఖబర్దార్ అంటూ హెచ్చరిం చారు. గత 12 సంవత్సరాలుగా లంగా పను లు దొంగ పనులు చేసి ఆ నెపాన్ని సీఎం రేవంత్ రెడ్డి మీద నెట్టేయడం ఏమిటని మండిపడ్డారు.
లక్షల కోట్ల రూపాయలు బిఆర్‌ఎస్ పార్టీ దొంగల ముఠా కొల్లగొట్టిన మొక్కవోని ధైర్యంతో కడుపు కట్టుకొని ఈ రాష్ర్ట ప్రజల సంక్షేమమే జెండాగా పని చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పై మరొక్కసారి అసత్య ఆరోపణలు అవాకులు, చెవాకులు పేల్చితే కాంగ్రెస్ కార్యకర్తలు అడుగడుగునా తన్ని తరుముతారని హెచ్చరించారు.
ఈ కా ర్యక్రమంలో గుండటి శ్రీనివాస్ రెడ్డి, వాడే వెంకట్ రెడ్డి,శ్రవణ్ నాయక్, కోరివి అరుణ్ కుమార్, తాజద్దీన్, అర్ష మల్లేశం, భూమా గౌడ్, గంట శ్రీనివాస్,తమ్మిడి ఎజ్రా, మెరా జ్, ఆశ్రఫ్, మాసూమ్, నదీమ్, కీర్తి కుమార్, భారీ, జీడీ రమేష్, ఆంజనేయులు, అబ్దుల్ రహేమాన్, ఆమీర్ తదితరులు పాల్గొన్నారు.