calender_icon.png 19 April, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి చట్టం రైతుల చుట్టం

19-04-2025 01:00:22 AM

పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.

అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

రైతుల మేలుకోసమే ప్రజాపాలన

పినపాక ఏప్రిల్ 18 (విజయ క్రాంతి) : కాంగ్రెస్ ప్రభు త్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, గత ప్రభుత్వం హయాంలో ధరణి ఏర్పాటుతో భూ సమస్యలు తలెత్తినవని, వాటిని పరిష్కరించి భూమిపై హక్కులు పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో భూభారతి చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలులోకి తెచ్చిందని, ఇది ముమ్మాటికి రైతు చుట్టం అన్నారు. పినపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్ జీవిఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన భూ భారతి చట్టం 2025 అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిదిగా పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ ఈ రోజున గుడ్ ఫ్రైడే రోజున భూభారతి అవగాహన సదస్సును రైతుల సమక్షంలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమని  జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్  చెప్పిన సూచనలు రైతులకి ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందన్నారు.గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టం వలన అనేక మంది రైతులు ఇబ్బంది పాలయ్యారని, రైతుల సమస్యలు పరిష్కరించుకోవడానికి చక్కటి భూభారతి చట్టాన్ని ఆవిష్కరించామన్నారు.

రైతులు వారి భూమిని నమ్ముకొని భూమి వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఈ భూభారతి చట్టం వరంలా గా మారుతుందని స్పష్టం చేశారు. రైతాంగం భూమిని నమ్ముకున్నటు వంటి ప్రజలందరూ ఈ చట్టం ద్వారా వారి  సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఒక చక్కటి వేదిక అన్నారు. అనంతరం పినపాక మండలం పొట్లపల్లి గ్రామానికి చెందిన 42 కుటుంబాలు పోడు భూముల సమస్యలపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కి, ఎమ్మెల్యే పాయం కి వినతి పత్రాలు అందజేశారు, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేసినారు.

ఈ కార్యక్రమానికి, కలెక్టర్ జితేష్ వి పాటిల్, భద్రాచలం ఆర్డీవో దామోదర్, అగ్రికల్చర్ ఏడిఒ తాతారావు, పినపాక ఎమ్మార్వో నరేష్ , ఎంపీడీఓ శ్రీనివాసరావు, ప్రభుత్వ అధికారులు, పినపాక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.