calender_icon.png 25 January, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాపాలన గ్రామసభలో ప్రజలకు అవమానం

25-01-2025 12:01:59 AM

మునగాల: ప్రజాపాలన గ్రామసభలో ప్రజలకు అవమానం జరిగి కుర్చీలు కరువైన సంఘటన మునగాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే నాలుగో రోజు మునగాల మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభల్లో కుర్చీలు లేకపోవడంతో ప్రజలు మూడు గంటలపాటు నేర్చుకోవాల్సిన పరిస్థితి. దీనిపై సంబంధిత అధికారులను అడిగినప్పటికీ సమస్య మీది నిల్చోవాల్సిందే తప్పదు అంతే అన్నట్లుగా సమాధానం ఇచ్చి తోసిపుచ్చారు. మండలంలో అన్ని గ్రామాల్లో తోపులాటలు ఘర్షణ వాతావరణంలో జరిగిన సమావేశాలు కాస్త మునగాలకు వచ్చేసరికి అధికారుల రాజ్యాంగ వ్యవహరిస్తున్నారు. దీనిపై ప్రశ్నించిన సామాజిక కార్యకర్త గంధం సైదులును సైతం సమావేశంలోనే తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థిని కూర్చోమన్న చందంగా నోరు మూయించడం జరిగింది.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమావేశాలు అధికారుల నిర్లక్ష్యం అంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హుల అందకుండా పోతుందని పలువురు ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజా పాలనలో గ్రామసభ ద్వారా చర్చించాల్సిన అధికారులే రాజకీయ నాయకుల మాదిరిగా చేపట్టడం ప్రజలను విస్మయానికి గురిచేసింది. దీంతో అర్హుల దరఖాస్తులు ఏ మేరకు ఆమోదానికి గురవుతాయని ఆందోళన గురవుతున్నారు. ప్రజా సమస్యలు ఆందోళనను పారదోలాల్సిన అధికారులే కొత్త సమస్యను తలపెట్టడంతో అర్హులు అయోమయానికి గురయ్యారు. స్వయాన మండల అభివృద్ధి అధికారి సమస్య పరిష్కరించకపోగా సమావేశాన్ని సాదాసీదాగా లబ్ధిదారుల పేర్లును ప్రజలకు వినిపించడమే సమావేశంగా మారింది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు మండల కేంద్రంలోని అర్హుల జాబితాలో సవరణ చేసి గుర్తించే విధంగా పార్టీలకతీతంగా చూడాలని లబ్ధిదారులు ప్రజలు కోరుతున్నారు.