calender_icon.png 4 December, 2024 | 2:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాపాలన ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

03-12-2024 10:46:32 PM

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు...

జైనూర్ (విజయక్రాంతి): ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు అన్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి అదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు అయి ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా చేపడుతున్న కార్యక్రమాలను విజయోత్సవాలలో ప్రజలకు వివరించాలన్నారు. ఈ నెల 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా గ్రామ గ్రామాన వేడుకలు నిర్వహించాలని కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు షేక్ ముఖి, నాయకులు ప్రకాష్, రషీద్, గంగారాం, కృష్ణ, సిర్పూర్, లింగాపూర్, జైనూరు మండలాల నాయకులు పాల్గొన్నారు.