calender_icon.png 15 March, 2025 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల విద్యా ప్రమాణాల అభ్యున్నతికి పిటిఎమ్ బాటలు వేయాలి

15-03-2025 07:43:32 PM

జిల్లా విద్యాధికారి... ఎం. వెంకటేశ్వర చారి...

పాల్వంచ (విజయక్రాంతి): విద్యార్థుల విద్యా ప్రమాణాల అభ్యున్నతికి పేరెంట్స్ టీచర్స్ సమావేశం (పేటీఎం) దోహదపడాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం పీటీఎంలు నిర్వహించారు. అందులో భాగంగా పాల్వంచ మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, పాలకొయ్య తండ పాఠశాలలో జరిగే PTM (తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం)నకు జిల్లా విద్యాధికారి హాజరై PTM ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు వివరించారు. ఈ సందర్బంగా జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ... విద్యార్థులకు సంభందించి ఇల్లు, పాఠశాలలను  అనుసంధానించే కీలకమైన వారధిగా PTM లు నిలిచేలా, విద్యార్థుల విద్యా ప్రమాణాల అభ్యున్నతికి బాటలు వేసేలా పేరెంట్స్, టీచర్స్ సమావేశాలను  నిర్వహించాలన్నారు. 

వంటిపూట బడుల నిర్వహణలో సమయపాలన విధిగా పాటించాలని, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నాణ్యత ప్రమాణాలను పాటించి అందించాలని, మండల విద్యాధికారులు తమ మండల పరిధి లోని పాఠశాలలను విధిగా సందర్శించి, పాఠశాలలు సమయపాలనతో కొనసాగేలా పర్యవేక్షించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సూచించారు.జిల్లా విద్యాశాఖ కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి యస్. కె. సైదులు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రయోజనం చేకూర్చే సహకార భాగస్వామ్యాన్ని పెంపొందించే విధంగా ప్రతి పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాలను(PTM) విధిగా నిర్వర్తించి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై తల్లిదండ్రు లతో చర్చించి, విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు తల్లిదండ్రులకు సలహాలను, సూచనలను అందజేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి యస్. కె. సైదులు, ప్రధానోపాధ్యాయులు దీనమ్మ, ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.