calender_icon.png 27 November, 2024 | 12:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల విద్యార్థులపై మానసిక ఒత్తిడి

27-08-2024 01:33:59 AM

పాఠశాలల పనివేళలు మానసిక వికాసానికి తగినట్టు ఉండాలి

ఇండియన్ సైకియాట్రిస్ట్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాం తి): గురుకుల విద్యార్థులపై మానసిక ఒత్తిడి ఉందని, పౌష్టికాహార, శారీరక వ్యాయామ లోపం, వివిధ మానసిక రుగ్మతలకు దారితీసి ఆత్మహత్యలకు కారణమవుతున్నాయని ఇండియన్ సైకియాట్రిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆకుల విశాల్ తెలిపారు. గురుకుల పాఠశాలల పనివేళలు విద్యార్థుల మానసిక వికాసానికి తగిన విధం గా ఉండాలని, ఉపాధ్యాయులు ఒత్తిడి లేకుండా పని చేసేట్టు సమయాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. టీఎస్‌యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గురుకులాల పనివే ళలుP విద్యార్థులపై ప్రభావం అనే అంశంపై హైదరాబాద్‌లో నిర్వహించిన రౌండ్ టేబు ల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గురుకుల పాఠశాలల పనివేళలు శాస్త్రీయంగా నిర్ణయించాలని వక్తలు డిమాండ్ చేశారు. సమావేశంలో టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శిలు కే జంగయ్య, చావ రవి, కోశాధికారి టీ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.