calender_icon.png 5 December, 2024 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

PSLV-C59 రాకెట్‌ ప్రయోగం వాయిదా

04-12-2024 03:54:15 PM

పీఎస్‌ఎల్‌వీ-సీ59 కౌంట్ డౌన్ నిలిపివేత

హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) బుధవారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ)-సీ59 ప్రయోగాన్ని వాయిదా వేసింది. పీఎస్‌ఎల్‌వీ-సీ59 ప్రయోగాన్ని రేపటికి సాయంత్రం 4.12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ఇస్రో ఎక్స్ వేదికగా ప్రకటించింది. సాంకేతిక లోపం తలెత్తడంతో కౌంట్ డౌన్ నిలిపివేశారు. పీఎస్‌ఎల్‌వీ-సీ59 రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.