జగదేవపూర్ (విజయక్రాంతి): పిఆర్టియు టి ఎస్ జగదేవపూర్ మండల శాఖ అధ్యక్షుడుగా చిలుకూరి వెంకట్రాంరెడ్డి రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రాత్లావత్ బొద్దు నాయక్ అసోసియేట్ అధ్యక్షులుగా నగేష్, ఉపాధ్యక్షులుగా భగవాన్ రెడ్డి, మహిళా ఉపాధ్యక్షులుగా అనురాధ, కార్యదర్శిగా రంజిత్ కుమార్,మహిళా కార్యదర్శులుగా విజయలక్ష్మి, గోపికళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండు సంవత్సరాల కాలానికి అందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మండలంలోని ప్రతి ప్రాథమిక సభ్యునికి కృతజ్ఞతలు తెలిపారు.
అధ్యక్షులు వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ మండలంలోని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడానికి తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శశిధర్ శర్మ,ప్రధాన కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి,పత్రికా సంపాదక వర్గ సభ్యులు జైపాల్ రెడ్డి,రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, రఘురాములు, మండల విద్యాధికారి ఉదయ భాస్కర్ రెడ్డి, మండల నోడల్ ఆఫీసర్ మాధవరెడ్డి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అనసూయ, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, రాష్ట్ర బాధ్యులు, జిల్లా బాధ్యులు,వివిధ మండలాల అధ్యక్ష,కార్యదర్శులు, ప్రాథమిక సభ్యులు,వివిధ మండలాల నుంచి వచ్చిన సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.