28-03-2025 08:55:35 PM
బూర్గంపాడు,(విజయక్రాంతి): మండల కేంద్రమైన బూర్గంపాడులో పెండింగ్ లో ఉన్న జిపీఎఫ్, టిఎస్జిఎల్, ఎస్ఎల్ బిల్లులు విడుదల చేయాలని డీఎ, పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మండల పీఆర్టియూ ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో డిటీ రామ్ నరేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్యదర్శి పద్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబురావు, ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్, రామారావు, పిఆర్టియు మండల అధ్యక్షులు శంకర్, ప్రధాన కార్యదర్శి జగన్, మండల మహిళా ఉపాధ్యక్షులు పద్మజ, కోశాధికారి రమేష్, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం టి.కిషన్ రావు, వీరేశం పాల్గొన్నారు.