13-03-2025 02:06:07 AM
జగిత్యాల, మార్చి 12 (విజయక్రాంతి): పిఆర్టీయు టీఎస్ సంఘ క్రియాశీల సభ్యులు అబ్దుల్ ముజీబ్ ఇటీవల మరణించగా, ఆయన కుటుంబానికి సంఘ పక్షాన బుధవారం రూ. 1 లక్ష చెక్కును అందజేశారు. కోరుట్ల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ముజీబ్ గత నెల 26న అనారోగ్యంతో మరణించారు.
పిఆర్టీయు టీఎస్ సంఘ బాధ్యతగా ఆ కుటుంబానికి ఒక లక్ష రూపాయల చెక్కును పిఆర్టీయు టీఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బోయినపల్లి ఆనందరావు, యాళ్ళ అమర్ నాథ్ రెడ్డిలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు అబ్దుల్ వాజిద్, జక్కుల నవీన్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సుధీర్, నాయకులు మహేష్, అడ్లగట్ట శ్రీనివాస్, ధరందీప్, సైఫుద్దీన్, ఆంజనేయులు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.