పాపన్నపేట (విజయక్రాంతి): తమ న్యాయమైన హక్కుల కోసం గత 19 రోజులుగా సమ్మె చేస్తున్న SSA ఉద్యోగులకు పిఆర్టియు పాపన్నపేట మండల శాఖ సంఘీభావం తెలిపి వారికి మౌలిక అవసరాల నిమిత్తం 18 వేల రూపాయలు ఆర్థిక సహకారం అందించింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేస్తున్న సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులకు శనివారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజు, సురేష్ మాట్లాడుతూ.. న్యాయమైన వారి డిమాండ్లు వెంటనే పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గత రెండు దశాబ్దాలుగా విద్యాశాఖలో భాగమై చాలీచాలని వేతనంతో ఇన్నాళ్లు పని చేశారని పెరిగిన నిత్యవసర ధరలు దృష్టిలో ఉంచుకొని వారికి మినిమం టైం స్కేల్ వర్తింపచేయాలని, ఉన్నత పాఠశాలల్లో నుండి మహిళా ఉపాధ్యాయినిలకు KGBVలో SO లుగా నియామక ఉత్తర్వులు వెంటనే నిలిపివేయాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వారిని రెగ్యులరైజ్ చేస్తూ సమ్మె విరమింపజేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పత్రికా సంపాదకులు వెంకటరామిరెడ్డి, కృష్ణమూర్తి, అంజనా చారి, భవాని ప్రసాద్, నర్సింలు, మహేష్ కుమార్, సతీష్ గౌడ్, నింగప్ప, వెంకటరమణ, జనార్ధన్, పిఆర్టియు పాపన్నపేట మండల బాధ్యులు పాల్గొన్నారు.